Batukammanews
Newspaper Banner
Date of Publish : 28 March 2026, 6:20 pm Posted by : ramakrishna

రాష్ట్ర స్థాయిలో అవార్డు అందుకోవడం గర్వకారణం

 

. . . నిజామాబాద్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల కు రాష్ట్ర స్థాయి ఉత్తమ అవార్డు

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

 

కళాశాల అభ్యున్నతికి రాష్ట్ర స్థాయిలో అవార్డ్ అందుకోవడం గర్వకారణమని నిజామాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ గంధం బుద్దిరాజ్ అన్నారు. హైదరాబాద్ ఆర్టీసీ కళాభవన్ లో హెచ్ఎంటీవీ, హ్యాన్స్ ఇండియా పత్రికల సంయుక్త ఆధ్వర్యంలో శనివారం ప్రభుత్వ విద్యా వ్యవస్థల ఉత్తమ సేవలు, ఫలితాల ఆధారంగా ప్రభుత్వ కళాశాలలు, పాఠశాలలను గుర్తించి అవార్డులు అందజేశారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల రాష్ట్ర స్థాయిలో ఉత్తమ కళాశాల అవార్డుకు ఎంపికైంది. రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతుల మీదుగా ప్రిన్సిపల్ గంధం బుద్ధిరాజ్ ఈ అవార్డు ను అందుకున్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ ఈ అవార్డు సాధించడానికి కళాశాల అధ్యాపక, అధ్యాపకేతర బృందం కృషి అనిర్వచనీయమని అన్నారు. ఈ అవార్డుతో కళాశాల అభ్యున్నతికి పాటుపడేందుకు మరింత బాధ్యత పెరిగిందని అన్నారు. బోధన, బోధనేతర సిబ్బందికి ఈ అవార్డ్ అంకితం ఇస్తున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎంటీవీ, హ్యాన్స్ ఇండియా పత్రిక మేనేజింగ్ డైరెక్టర్ హనుమంతరావు, ఎడిటర్ వెంకటరెడ్డి లు పాల్గొన్నారు.