జయశంకర్ బీసీ బిడ్డ కావడం గర్వకారణం

బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : ఆచార్య జయశంకర్ సిద్ధాంతాలు, మార్గదర్శకత్వం లేకపోతే తెలంగాణ రాష్ట్ర సాధన సాధ్యమయ్యేది కాదని, జయశంకర్ ఒక బీసీ బిడ్డ కావడం ప్రతి బీసీ సమాజానికి గర్వకారణమని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ పేర్కొన్నారు. తెలంగాణ సిద్ధాంతకర్త, ఆత్మగౌరవ పోరాట పథ నిర్దేశకుడు ఆచార్య కొత్తపల్లి జయశంకర్ 92వ జయంతి సందర్భంగా గురువారం నగరంలోని కంటేశ్వర్ చౌరస్తాలో ఉన్న ఆయన విగ్రహానికి బీసీ సంక్షేమ సంఘం జిల్లా...