Batukammanews
Newspaper Banner
Date of Publish : 25 March 2026, 7:51 pm Posted by : ramakrishna

అధ్యాపకులు రచయితలుగా రాణించడం గొప్ప అవకాశం

 

. . . గిరిరాజ్ కళాశాల ప్రిన్సిపాల్ పి.రామ్ మోహన్ రెడ్డి

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

కళాశాల అధ్యాపకులు రచయితలుగా రాణించడం వ్యక్తిగతంగానే కాకుండా కళాశాల ప్రతిష్టను పెంచుకోవడానికి ఒక గొప్ప అవకాశమని గిరిరాజ్ కాలేజ్ ప్రిన్సిపాల్ పి.రామ్ మోహన్ రెడ్డి అన్నారు. జి.జి. కళాశాల అధ్యాపకులు ఇటీవల వివిధ యూజీ & పీజీ కోర్సుల కొత్త సిలబస్‌లోని మార్పులకు అనుగుణంగా,  పలు ప్రచురణకర్తలు ప్రచురించిన పాఠ్య పుస్తకాలు, మెటీరియల్ రచనకు నిష్ణాతులైన అధ్యాపకులను ఎంపిక చేసుకోని వారిచేత విద్యార్థులకు ఉపయుక్తంగా ప్రామాణికమైన పుస్తకాలు, మెటీరియల్ ను రూపొందింపజేశారు. ఆ పుస్తకాలను కళాశాల రచయితలతో పాటు ప్రిన్సిపాల్ బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మైక్రోబయాలజీ సబ్జెక్టులో ముత్తెన్న, చంద్రశేఖర్, కామర్స్ విభాగం రచయితలు డా.రంజిత, రాహుల్, త్యాగరాజు, చాంద్ పాషా, ప్రవీణ్, తదితర పుస్తక రచయితలను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ రంగరత్నం, అకడమిక్  కోఆర్డినేటర్ నహీదా బేగం, ఐక్యూ. ఏ.సి. కో ఆర్డినేటర్ డాక్టర్ రాజేష్, పి.ఆర్.ఓ. దండు స్వామి, ఎన్ సిసి అధికారి లెఫ్టినెంట్ డా.రామస్వామి, పరీక్షల నియంత్రణ అధికారి భరత్ రాజ్, కామర్స్ విభాగం అధిపతి వినయ్ కుమార్,  పి.డి. బాలామణి, అధ్యాపకులు వేణుగోపాల్, నరేష్, సుమన్, సంతోష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

 

It is a great opportunity for teachers to excel as writers.