- కేటీఆర్ చేసిందే దగుల్బాజితనం
- కేసీఆర్ ఇంకా ముఖ్యమంత్రి అనుకుంటున్నారా?
- తెలంగాణను అప్పుల పాలు చేశారు
- నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్
నిజామాబాద్, బతుకమ్మ : ఈ ఫార్మూల ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ, ఈడి ముందు హాజరుకావాలని మాజీ మంత్రి కేటీఆర్ కు నోటీసులు ఇస్తే తాను హాజరుకానని న్యాయవాదులతో వస్తానని పలు విధాలుగా అంటున్నారని చట్టం తన పని తాను చేసుకుంటే పర్వాలేదు కానీ లేకపోతే లాఠీలే ఆ పని చేస్తాయని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ వ్యాఖ్యానించారు. సోమవారం కేటీఆర్ కేసులో విచారణకు హాజరుకాకుండా వ్యవహరిస్తున్న తీరుపై ఎంపీ అరవింద్ సోషల్ మీడియాలో వీడియోను పోస్టు చేశారు. ఆ వీడియోలో కేటీఆర్ ను నప్పతట్లాలోడు అంటూ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. కేటీఆర్ ఇప్పటికి తన తండ్రి కేసీఆరే ముఖ్యమంత్రి అని అనుకుంటున్నాడని అన్నారు. తెలంగాణను అప్పుల పాలు చేసింది కేసీఆర్ కుటుంబమన్నారు. సంవత్సరాల తరబడి అప్పుల ఊబిలో ముంచిన కుటుంబం చేస్తున్న వ్యాఖ్యలు హాస్యాప్పదంగా ఉన్నాయన్నారు. ప్రధానంగా లిక్కర్ కేసులో కవిత ఈడి ముందు హాజరుకాకుండా తాను మహిళనని, తన ఇంట్లో నుంచే విచారణ కు హాజరవుతానని ఎలా పేర్కొన్నారో ఇప్పుడు కేటీఆర్ కూడా అదే ధోరణిలో మాట్లాడుతున్నారని విమర్శలు చేశారు. కేటీఆర్ చేసింది మంచిపని కాదని దగుల్బాజితనం, దొంగతనం అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ తాను చట్టాన్నిగౌరవమిస్తామని అంటునే విచారణకు హాజరుకావాలంటే లాయర్లతో హాజరవుతాను, విచారణకు హాజరుకానీ, తానేమి చేయలేదని బుకాయించడం దారుణమన్నారు.