Batukammanews
Newspaper Banner
Date of Publish : 30 January 2026, 2:42 pm Posted by : ramakrishna

కేసీఆర్ కి నోటీసులు ఇవ్వడం తెలంగాణ అస్తిత్వానికే అవమానం

 

. . . కుంభకోణాల నుండి ప్రజల దృష్టి మళ్లించడానికే ఈ డ్రామాలు

 

. . . ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దగ్ధం

 

ఎల్లారెడ్డి, బతుకమ్మ : 

 

తెలంగాణ సాధకుడు కేసీఆర్ కి సిట్ నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎల్లారెడ్డి మండల కేంద్రంలో  బీ ఆర్ ఎస్ కార్యకర్తలతో కలిసి సి ఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ తగులబెట్టి నిరసన తెలిపారు. ఈ సందర్బంగా ఎల్లారెడ్డి మాజీ శాసనసభ్యులు జాజాలసురేందర్ మాట్లాడుతూ దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా నిలబెట్టిన తెలంగాణ జాతిపిత కేసీఆర్ కి సిట్ నో టీసులు ఇవ్వడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కక్ష సాధింపు చర్యలు పరాకాష్టకు చేరాయని వారు మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేక, పాలనను గాలికి వదిలేశారని విమర్శించారు. ప్రజల దృష్టిని మళ్లించడానికే కాళేశ్వరం కమిషన్లని, సిట్ అని, ఫోన్ ట్యాపింగ్ అని రకరకాల పేర్లతో కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు, ఇప్పుడు ఏకంగా కేసీఆర్ ని వేధిస్తున్నారని ఆరోపించారు.రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ నాయకులు పనిచేయకుండా, కేసుల చుట్టూ తిరిగేలా చేయాలనే కుట్రతోనే రేవంత్ రెడ్డి ఈ చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.ఈ కార్యక్రమంలో మాజీ జడ్పి చైర్మన్ దఫేదార్ రాజు, ఎల్లారెడ్డి నియోజకవర్గ అన్ని మండలాల బిఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.