బీసీ కమిషన్ కు సమస్యలను విన్నవించాలి

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: బీసీ కమిషన్ సభ్యులు మంగళవారం జిల్లా కేంద్రానికి రానున్నారని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ తెలిపారు. సంఘం ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీ కమిషన్ సభ్యులు మంగళవారం ఉదయం 10 గంటల నుంచి కలెక్టరేట్ లో అందుబాటులో ఉంటారని, తమ సమస్యలు, డిమాండ్ లను వివరిస్తూ బీసీ సోదరులు వినతిపత్రాలు అందజేయాలని సూచించారు. క్షేత్రస్థాయిలో బీసీల విద్య ఉద్యోగ ఆర్థిక రాజకీయ సామాజిక స్థితిగతులను రాజకీయ పార్టీలకు అతీతంగా కమిషన్...