విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి
. . . ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో సమస్యలపై రూరల్ ఎంఈఓ కు వినతిపత్రం నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పిడిఎస్ యు నగర కమిటీ ఆధ్వర్యంలో రూరల్ ఎంఈఓ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పిడిఎస్ యు నగర అధ్యక్షుడు ఎండి. నసీర్, కార్యదర్శి ఆల్గోట్ సృజన్ మాట్లాడుతూ విద్యారంగంలో నెలకొన్న సమస్యలపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత,...