. . . ప్రజాప్రతినిధులు ప్రభుత్వ పాఠశాలలను సందర్శించాలి
. . . పిడిఎస్ యు జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలలో ప్రజాప్రతినిధులు సందర్శించి సమస్యలను పరిష్కరించాలని పిడిఎస్ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ డిమాండ్ చేశారు. మంగళవారం నగరంలోని శంకర్ భవన్ ప్రభుత్వ పాఠశాల గేట్ వద్ద పిడిఎస్ యూ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బ్రేక్ ఫాస్ట్ & మిల్క్ పథకాన్ని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేయాలని, ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక సదుపాయాలు లేక విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా టాయిలెట్స్ లేవని, వర్షాకాలం వర్షం లో కొన్ని క్లాస్ రూమ్స్ ఊరుస్తాయని వాటి స్థానంలో నూతన రూమ్ లను ఏర్పాటు చేయాలని, సకాలంలో విద్యార్థులకు యూనిఫామ్స్ ఇవ్వాలని, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు సమస్యల వలయంలో ఉన్నాయని, ప్రజాప్రతినిధులు ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పి డి ఎస్ యూ నగర అధ్యక్షులు సిర్రం పవన్ కుమార్, నాయకులు శ్రీకర్, భవాని, దత్తు, వంశీ, చరణ్, శ్రీజ, విద్యార్థులు పాల్గొన్నారు.