Batukammanews
Newspaper Banner
Date of Publish : 13 November 2026, 2:26 pm Posted by : ramakrishna

రాష్ట్ర స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ కి ఇస్సాపల్లి విద్యార్థి

 

ఆర్మూర్, బతుకమ్మ :        

 

సంగారెడ్డిలో జరిగే రాష్ట్ర స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ కి   ఇస్సాపల్లికి చెందిన లక్ష్మణ్ ఎంపిక కావడం పట్ల పాఠశాల ఫ్రధానోపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు. కామారెడ్డి లో జరిగిన జిల్లా స్థాయి అండర్ 14 బాయ్స్ వాలీబాల్  లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇస్సాపల్లి  విద్యార్థి తెడ్డు లక్ష్మణ్ ప్రతిభ కనబర్చడంతో సంగారెడ్డి లో జరిగే రాష్ట్ర స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ కి ఎన్నికయ్యారు. 13వ తేది నుంచి మూడు రోజుల పాటు జరిగే వాలీబాల్ పోటీలకు లక్ష్మణ్ ఎన్నిక కావడం తో పీఈటీ, రాజేష్ ను, జడ్పీహెచ్ఎస్ ఇస్సాపల్లి ప్రధానోపాధ్యాయులు రాజగంగారాం, గ్రామ సర్పంచ్, ఉప్ప సర్పంచ్, వీడీసీ సభ్యులు, పాఠశాల ఉపాధ్యాయులు అభినందించారు.