Batukammanews
Newspaper Banner
Date of Publish : 17 May 2026, 9:04 pm Posted by : ramakrishna

ఇస్కాన్ ఆధ్వర్యంలో కృష్ణ, బలరాముల పల్లకి ఊరేగింపు

 

ఏర్గట్ల, బతుకమ్మ :

 

ఏర్గట్ల గ్రామంలో ఆధ్యాత్మిక చైతన్యం వెళ్లి విరిసింది. శ్రీల ప్రభుపాద (ఇస్కాన్) హైదరాబాద్ బంజారా హిల్స్ వారి ఆధ్వర్యంలో కృష్ణ, బలరాముల పల్లకి ఊరేగింపు కార్యక్రమాన్ని ఘనంగా జరిపారు. హరినామ కీర్తనలతో ఎంతో భక్తితో రోడ్డుపై హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే అనే నినాదాలతో నృత్యాలు చేస్తూ ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. సాయంత్రం 6 గంటలకు ఈ ఆధ్యాత్మిక వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో భాగంగా భక్తుల కోలాహలం మధ్య కృష్ణ, బలరాముల పల్లకి సేవ, భక్తి పారవశ్యంతో కూడిన సంకీర్తనలు, ఆధ్యాత్మిక నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అనంతరం పల్లకి ఊరేగింపు గ్రామంలోని ముఖ్య కూడళ్ల గుండా సాగింది. ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం వద్ద ప్రారంభమై హై స్కూల్, గుండం, సర్గమ్మ గల్లి, గాంధీ నగర్, హరిజన వాడ, మార్కండేయ ఆలయం గుండా సాగి లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం వద్ద భగవద్గీత ప్రవచనం, ప్రసాద వితరణతో ముగిసింది. ఈ కార్యక్రమంలో ఇస్కాన్ సభ్యులు, గ్రామస్తులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

 

ISKCON organizes palanquin procession of Lord Krishna and Lord Balarama