Batukammanews
Newspaper Banner
Date of Publish : 29 November 2024, 1:07 pm Posted by : ramakrishna

ఇస్కాన్ శాంతియుత నిరసన

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: బంగ్లాదేశ్ లో హిందువులు, హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులు, అరాచకాలకు వ్యతిరేకంగా ఇస్కాన్(కంఠేశ్వర్) ఆధ్వర్యంలో నగరంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో శుక్రవారం నిరసన తెలిపారు. పలు హిందూ సంఘాలకు మద్దతు తెలిపాయి. ఈ సందర్భంగా ఇస్కాన్ జిల్లా ప్రతినిధి రామానంద రాయ గౌరదాస్ మాట్లాడుతూ.. బంగ్లాదేశ్ ప్రజాప్రతినిధులు, ఆ దేశం వారు హిందువులపై ద్వేషం పెంచుకొని ఇష్టం వచ్చిన విధంగా హిందూ దేవాలయాలపై, హిందూ సంస్థలపై విధ్వంసం సృష్టించడాన్ని ఖండించారు. వెంటనే మన దేశ ప్రభుత్వం బంగ్లాదేశ్ తో మాట్లాడిహిందువులపై జరుగుతున్న అరాచకాలను, దాడులు ఆపేలా చర్చలు తీసుకోవాలన్నారు.

ISKCON is a peaceful protest