నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: తెలంగాణ అగ్రికల్చర్, ఫార్మర్ వెల్ఫేర్ కమిషన్ సభ్యుడిగా నియమితులైన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడుగు గంగాధర్ ఆ పదవిని తిరస్కరించారు. ఆయనను ఏడుగురు సభ్యుల్లో ఒక సభ్యుడిగా నియమిస్తూ వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సోమవారం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. సీనియరైన తనను సభ్యుడి పదవికి పరిమితం చేయడంపై సీనియర్లకు ఇచ్చే గౌరవం ఇదేనా అని ఆగ్రహం వ్యక్తం చేయగా.. కాంగ్రెస్ అధిష్ఠానం ఆయనతో చర్చిస్తోంది. అధిష్టానం తనను గుర్తించడం లేదని గడుగు ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో కూడా తనకు కీలక పదవులను ఇవ్వకుండా, ఇప్పుడూ అలానే వ్యవహరించడం పట్ల ఆయన అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం.