Batukammanews
Newspaper Banner
Date of Publish : 09 July 2025, 3:12 pm Posted by : ramakrishna

సమస్య పరిష్కారమా..?

  • మరో సమస్యను సృష్టించడమా..?

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలోని లక్ష్మారెడ్డి ధవాఖానా చౌరస్తాలో ట్రాఫిక్ కట్టడి చర్యలు నిజామాబాద్ ట్రాఫిక్ పోలీసుల తెలివితేటలను తేటతెల్లం చేస్తున్న తీరుపై నగర పౌరులు అసహనం, ఆగ్రహానికి గురి చేస్తున్నాయి. మరోకింత వాహనదారుల ట్రాఫిక్ ఉల్లoఘనలపై మరింత అగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ట్రాఫిక్ రూల్స్ మరిచిన వాహనదారులు అడ్డదిడ్డంగా వాహనాలు నడుపుకుంటు వారికి వారే ఇబ్బందులు సృష్టించుకోవడం, నిముషాల తరబడి, ఒక్కోసారి అర్థ గంట పైచిలుకు ట్రాఫిక్ లో ఇరుక్కపోయి నానా అవస్థలుపడుతున్నారు. అయిన షరా మామూలుగానే ఒక లైన్ లో పోకుంట ట్రాఫిక్ సమస్యను కొని తెచ్చుకుంటున్నారు. ఈ ప్రాంతంలో పలు ఆసుపత్రులు, వ్యాపార సముదాయాలు కొత్తగా వెలియడంతో వినియోగదారుల రాకపోకడలు పెరిగి పోయాయి. వాహనాల రద్దీ, బాధ్యతలు మరిచి యదేచ్చగా ట్రాఫిక్ రూల్స్ ఉల్లంగనలో మన పౌరుల తీరేవేరు. నిత్యం ట్రాఫిక్ కటకటాలతో ఇబ్బందులు పడుతున్న నిజాయితీ పరులైన పౌరుల కష్టాలు చూసిన ట్రాఫిక్ పోలీసులు లక్ష్మారెడ్డి ఆసుపత్రి చౌరస్తాలో మొన్నిమధ్య భారీకేడ్లు పెట్టి లెఫ్ట్ సైడ్ వెళ్ళటానికి అనుకూలంగా ట్రాఫిక్ క్రమబద్దీకరణ చేసి చౌరస్తా మధ్యలో భారీకేడ్లు పెట్టడం మూలంగా మరో సమస్య మొదలైంది. ఎండల టవర్ నుండి వచ్చే వాహనాలు లెఫ్ట్ నుండి తిరిగి నిఖిల్ సాయి చౌరస్తా దగ్గరకు వెళ్లి తిరిగి రావలసిన ఆగత్యం ఏర్పడింది. దీంతో నిఖిల్ సాయి చౌరస్తాలో రెడ్ సిగ్నల్ పడగానే అక్కడి నుండి కపిల హోటల్ వరకు వాహనాలు నిలబడిపోయి మరో కొత్త ట్రాఫిక్ సమస్య మొదలైంది. ఒక సమస్య పరిష్కరిద్దామంటే మరో సమస్య ముందు కొచ్చిందనేది నగర పౌరుల ఆవేదనగా ఉంది. లక్ష్మారెడ్డి ఆసుపత్రి చౌరస్తా వద్ద ఉన్న మున్నూరు కాపు కమాన్ చుట్టు పక్కల ఇంటి యజమానుదారులు వారి ఇంటి కంపండ్ వాల్ దాటి ఐరన్ షెడ్ తో షాపులు ఏర్పాటు చేపిచ్చి కిరాయి దండుకునుని ట్రాఫిక్ సృష్టికి కారణమవుతున్నారు. నిజామాబాద్ నగర పాలక సిబ్బంది కంటిలో కనబడుతలేదేమని ఒక ప్రశ్నగా వెక్కిరిస్తునది..? ఇంతకీ ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ నియంత్రణకు ఏర్పాటు చేశారా… మరొక ట్రాఫిక్ సమస్యను సృష్టించారా… అనేది నగర పౌరులను వేదిస్తున్నది.. ట్రాఫిక్ రూల్స్ పై బాధ్యత లేని వాహనదారులు.. బాధ్యత గల వాహనదారులకు గుదిబండగ తయారు అయ్యారు. రోడ్డు వెడల్పు ల గూర్చి, ట్రాఫిక్ రంధీ ఎట్లా తీర్చాలనే కనీస బాధ్యతలేని ప్రజా ప్రతినిధులు మనకు ఉండనే ఉన్నారు అనేది జనం బాధ. వెరసి నగరం ఒక ట్రాఫిక్ పద్మవ్యూహంగా మారిపోతుందా అనేది మిలియన్ డాలర్ల చింతగా ప్రజలను వేదిస్తుంది.

Is the problem solved?