సర్కారు ఇచ్చిన భూమికి ప్రైవేట్ పట్టానా..?

తప్పుడు రిపోర్టులు ఇచ్చిన సర్వే అధికారులు అధికారుల అండతో భూ కబ్జాకు యత్నం నిజామాబాద్ సిటి, బతుకమ్మ:  నిజామాబాద్ నగరంలోని నాగారం శివారులో 2164 సర్వే నంబర్ లోని భూమిని అధికారులు ఇచ్చిన తప్పుడు రిపోర్టులతో కబ్జా చేస్తున్నారని బాధితులు సయ్యాద్ ముర్తజ అలీ అనే వ్యక్తి ఆరోపించారు. నాగారం శివారులోని ప్రముఖ మైనార్టీ విద్యా సంస్థ ప్రక్కన గల భూమిని పది సంవత్సరాల క్రితం సయ్యాద్ ఖమర్ భానుకు ప్రభుత్వం ఎకరం భూమిని కేటాయించిందన్నారు. అది 2009 నుంచి దానిని తామే అనుభవిస్తున్నామని...