Batukammanews
Newspaper Banner
Date of Publish : 17 January 2025, 8:15 pm Posted by : ramakrishna

సర్కారు ఇచ్చిన భూమికి ప్రైవేట్ పట్టానా..?

  • తప్పుడు రిపోర్టులు ఇచ్చిన సర్వే అధికారులు
  • అధికారుల అండతో భూ కబ్జాకు యత్నం

నిజామాబాద్ సిటి, బతుకమ్మ:  నిజామాబాద్ నగరంలోని నాగారం శివారులో 2164 సర్వే నంబర్ లోని భూమిని అధికారులు ఇచ్చిన తప్పుడు రిపోర్టులతో కబ్జా చేస్తున్నారని బాధితులు సయ్యాద్ ముర్తజ అలీ అనే వ్యక్తి ఆరోపించారు. నాగారం శివారులోని ప్రముఖ మైనార్టీ విద్యా సంస్థ ప్రక్కన గల భూమిని పది సంవత్సరాల క్రితం సయ్యాద్ ఖమర్ భానుకు ప్రభుత్వం ఎకరం భూమిని కేటాయించిందన్నారు. అది 2009 నుంచి దానిని తామే అనుభవిస్తున్నామని తెలిపారు. అయితే ఇటీవల రెవెన్యూ, ల్యాండ్ సర్వే అధికారులు గతేడాది తమకు కేటాయింయచిన సర్వే నంబర్ లోని భూమిని వేరే నంబర్ భూమి అక్కడ ఉందని తప్పుడు రిపోర్టులు ఇచ్చారని తెలిపారు. సంబంధిత భూమి ప్రభుత్వ భూమిని మార్చి ప్రైవేట్ పట్టా భూమిగా చూపడం దారుణమన్నారు. అంతేగాకుండా అటవిశాఖకు ఎన్ వోసీ కోసం దరఖాస్తు చేసిన ఎలాంటి అనుమతులు లేకపోయినప్పటికీ సంబంధిత భూమిని కబ్జా చేస్తున్నారని అధికారుల అవినీతిపై, అక్రమాలపై జిల్లా కలెక్టర్ తో పాటు ఉ న్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. సంబంధిత భూమిలో ఎలాంటి అనుమతులు లేకున్నా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని ఈ విషయంపై తహ సీల్ధార్ తో పాటు మున్సిపల్ కమిషనర్ కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

Is government land a private title?