హిడ్మా ఎన్‌కౌంటర్‌తో మావోయిస్టు ఉద్యమానికి తుది దెబ్బ..?

మూడు రాష్ట్రాల జంక్షన్‌లో భద్రతా దళాల భారీ ఆపరేషన్‌   హైదరాబాద్, బతుకమ్మ : భారతదేశ అంతర్గత భద్రతకు దశాబ్దాలుగా సవాలుగా నిలుస్తున్న మావోయిస్టు ఉద్యమం భారీ ఎదురుదెబ్బను ఎదుర్కొంది. ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ త్రి జంక్షన్ అటవీప్రాంతంలో జరిగిన భద్రతా దళాల ఆపరేషన్‌లో అగ్ర మావోయిస్ట్ నాయకుడు మాడ్వి హిడ్మా హతమయ్యాడు. అనేక రాష్ట్రాల ఇంటెలిజెన్స్ సంస్థలు లక్ష్యంగా పెట్టుకున్న హిడ్మా మరణం, నక్సలిజంపై జరుగుతున్న యుద్ధంలో కీలక మలుపుగా నిపుణులు అభివర్ణిస్తున్నారు. ఎన్‌కౌంటర్‌లో హిడ్మాతోపాటు ఆరుగురు తిరుగుబాటు దారులు మృతి చెందినట్లు...