వెబ్ న్యూస్, బతుకమ్మ: ఆపరేషన్ సిందూర్ తో పాకిస్తాన్ లోని ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేసిన భారత్ దాడులు చేసిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన ఆ దేశ ప్రధాని ప్రతి రక్తపు బొట్టుకు సమాధానం ఇచ్చి తీరుతామని ప్రకటించారు. అయితే ఆ దిశగానే పాకిస్తాన్ భారతదేశంలోని పలు నగరాలపై గురువారం దాడికి యత్నించినట్లు తెలుస్తోంది.
చైనాకు చెందిన మిస్సైల్స్ తో దేశంలోని జమ్ము, శ్రీనగర్, అమృత్ సర్, పఠాన్ కోట్, బటిండా, లుథియానా, జలంధర్, చండీగఢ్, అవంతిపుర, భుజ్, ఫలోడి తదితర నగరాలపై దాడికి యత్నించగా మన దేశ ఎస్ 400 ఎయిర్ డిఫెన్స్ సమర్థంగా అడ్డుకున్నట్లు సమాచారం. అయితే దీనిపై ప్రభుత్వం లేదా భారత ఆర్మీ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.