పార్టీ ఆఫీస్ లో కూర్చుని మాట్లాడితే సరిపోతుందా
రాష్ట్రంలో పార్టీని ఏం చేద్దామనుకుంటున్నారు రాష్ట్ర పార్టీ సమావేశంలో ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఫైర్ హైదరాబాద్, బతుకమ్మ : ఎంపీలు, ఎమ్మెల్యేల మధ్య సమన్వయ లోపం ఉంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిసి కూర్చోలేని పరిస్థితి ఎందుకు వచ్చింది. రాష్ట్ర పార్టీ అధిష్టానం ఏం చేస్తుందని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల సమావేశంలో వెంకటరమణారెడ్డి రాష్ట్ర అధిష్టానంపై ఫైర్ అయ్యారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో...