పాఠశాలలో వాష్ రూమ్స్ లేకపోవడమా..?

విద్యార్థినిల పరిస్థితి ఏమిటి..? సీనియర్ సివిల్ జడ్జి విస్మయ్యం..!   నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా న్యాయసేవ అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఉదయ్ భాస్కర్ రావు సోమవారం నిజామాబాద్ నగర పాలక సంస్థ పరిధిలో గల సారంగ పూర్ ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలను సోమవారం సందర్శించారు. జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ తో కలిసి పాఠశాల ప్రాంగణమంత కలియ తిరిగారు. మౌళిక సదుపాయల కొరత, వాష్ రూమ్స్ లేకపోవడం గుర్తించారు. విద్యార్థుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. విద్యాలయం విద్య నేర్చుకోవడానికి...