Batukammanews
Newspaper Banner
Date of Publish : 05 February 2026, 7:52 pm Posted by : ramakrishna

ఇందూర్ నగరమా?

 

. . . నిజామాబాద్ పట్టణమా?

 

. . . కార్పొరేషన్ కు తక్కువ మున్సిపాలిటీకి ఎక్కువ

 

. . . నగరాభివృద్ధికి చిత్తశుద్ధి లేని పాలకులు

 

. . . రాష్ట్రంలో ప్రణాళిక లేని నగరం ఇందూర్ దే

 

నిజామాబాద్, బతుకమ్మ :

 

తెలంగాణ రాష్ట్రంలో 100 సంవత్సరాల చరిత్ర కలిగిన పురాతన ఇందూర్ పట్టణం నగరపాలక సంస్థగా రూపాంతరం చెందిన అభివృద్ధికి నోచుకోవడం లేదు… పాలకులకు చిత్తశుద్ధి లేకపోవడంతో రెండు దశాబ్దాల క్రితం నగర పాలక సంస్థ గా అప్ గ్రేడ్ అయినా ఎలాంటి మార్పు లేదు.. నిజామాబాద్ అభివృద్ధి కోసం అని ఐదేళ్ల క్రితం నూడా ( నిజామాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ) ఏర్పాటు జరిగిన ఒక ఇంచ్  డెవలప్మెంట్ జరగలేదు. పాలకులకు పదవుల మీద ఉన్న ధ్యాస నిజామాబాద్ నగరం పై లేకపోవడంతో ప్రణాళికల ఎదుగు బతుకు లేకుండా ఉండిపోయింది. రాష్ట్రంలో ప్రస్తుతం ఏడు మున్సిపల్ కార్పొరేషన్ లకు ఎన్నికలు జరుగుతుండగా డెవలప్మెంట్ లేని నగరంగా ఇందూర్ పేరు చివరిదిగా చెప్పాలి. దేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు, తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన  తరువాత పాలకులుగా ఉన్న కాంగ్రెస్, బిఆర్ఎస్ లు  నగర అభివృద్ధిని విస్మరించారు.. మళ్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు రావడంతో లీడర్లు ఓట్ల కోసం అభివృద్ధి జపం చేస్తున్నారు… కానీ ఒక్కరు కూడా నగరాభివృద్ధిని రూపురేఖలను మారుస్తామని ఓట్లను అడగలేకపోతున్నారు.. ఎన్నికల అప్పుడు మాత్రమే నగర అభివృద్ధికి అంటున్నారు కానీ వాస్తవ రూపంలో కార్యరూపం దాల్చడం లేదు…

నిజామాబాద్ నగర పాలక సంస్థ గా రికార్డులకే అభివృద్ధి పరిమితమైంది. ఐదు లక్షల జనాభా  కలిగిన నగరం, నిత్యం లక్షకు పైగా జనాల రాకపోకలు కలిగిన రూపు రేఖలు లేవు.. నిజామాబాద్ మున్సిపాలిటీగా 1973 నాటి మాస్టర్ ప్లాన్ చివరిది.. 2017 మాస్టర్  ప్లాన్ తయారుచేసి ముసాయిదా మాస్టర్ ప్లాన్ అసెంబ్లీలో ఇప్పటికి ఆమోదం నోచుకోలేదు.. దానితో రాష్ట్రంలోని ఇరుకు నగరంగా ఇందూరుకు పేరు వచ్చింది.. నగరంలో 100 ఫీట్ల రోడ్ లు కనిపించడం లేదు. నగరంలో 50 ఫీట్ల రోడ్లతో వెంచర్లు కనిపించవు 30 ఫీట్ల రోడ్లు కలిగిన పరిమితమయ్యాయి. పబ్లిక్ పార్కుల కోసం కేటాయించిన టెన్ పర్సెంట్ ల్యాండ్ లు కబ్జాకు గురై ప్లాట్లుగా అమ్మకాలు జరుగుతున్నాయి  జరుగుతుంది.. నిజామాబాద్ నగరంలో మాస్టర్ ప్లాన్ లేకపోవడంతో అక్రమ నిర్మాణాలు జరుగుతున్న బల్దియా పెద్దగా పట్టించుకున్న పాపాన పోలేదు.. అక్రమ నిర్మాణాలు, అక్రమ వెంచర్లు, ఆనుమతుల్లేని భవనాల నిర్మాణాలు కార్పొరేటర్లతో మొదలుకొని అధికారులకు కాసులు కురిపించే అడ్డాలుగా మారాయి.. పులాంగ్ వాగుతోపాటు,,, డిస్ట్రిబ్యూటరీ కాలువలు, డ్రైనేజీలు కబ్జా గురైన పట్టించుకునే నాథుడే లేడు.. హలో నగరపాలక సంస్థ పరిధిలోని రామ్మూర్తి చెరువు,, బొందం చెరువు, నక్కల వాగు, బ్రాహ్మణ కుంట, గులుషన్ చెరువులు కబ్జాల గురై ఆనవాళ్లు లేకుండా పోతున్న కన్నెత్తి చూడటం లేదు…

నిజామాబాద్ నగరంలో ల్యాండ్ మార్క్ లాంటి డెవలప్మెంట్ ఒక్కటి కూడా కనిపించదు.. ఉమ్మడి జిల్లా కలెక్టరేట్ గా సేవలందించిన ప్రగతి భవన్ ను బైపాస్ లో నిర్మించి నగర అభివృద్ధిని అడ్డుకున్నారు.. వందేళ్ల చరిత్ర కలిగిన ఇందూరుకు రింగ్ రోడ్ లేదు… రెండు దశాబ్దాల క్రితం నిర్మించిన బైపాస్ రోడ్డు ఇప్పటికి పూర్తి కాలేదు.. రోడ్ల విస్తరణ ఇంతవరకు మంత్రులు గాని ఎమ్మెల్యేలు గానీ సాహసించలేదు.. ఇందూరు ను ఇరుకు నగరంగా మార్చింది పాలకులే… రోడ్ల విస్తరణ చేయకుండా ఉన్న రోడ్లపై తారును కొత్తగా వేసి నగరాభివృద్ధి అని చెప్పుకున్న ఘనత పాలకులదే. నిజామాబాద్ నగరానికి కొత్త మేయర్లు వస్తున్నారు పోతున్నారు నుడాకు చైర్మన్లు డైరెక్టర్లు వస్తున్న జరిగిన అభివృద్ధి మాత్రం శూన్యం… ఈసారి బల్దియా ఎన్నికల్లో నగరాభివృద్ధిని చేసి చూపుతామని మేనిఫెస్టోను అమలు చేసే సత్తా ఉన్న నాయకులని ఎన్నుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

 

Is Indore a city?