Batukammanews
Newspaper Banner
Date of Publish : 02 March 2025, 12:18 pm Posted by : ramakrishna

సాగునీటిని పొదుపుగా వాడుకోవాలి

. చివరి ఆయకట్టుకు నీరు అందేలా చర్యలు

. పంటలు ఎండకుండా రైతులను ఆదుకుంటాం

. మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి

నవీపేట, బతుకమ్మ: సాగునీటిని రైతులు పొదుపుగా వాడుకోవాలని, చివరి ఆయకట్టుకు నీరు అందేలా ఇరిగేషన్ అధికారులు చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. మండల కేంద్రంతోపాటు జన్నేపల్లిలో పంటలను, సాగునీటి కాలువలను రైతులతో కలిసి ఆదివారం ఆయన పరిశీలించారు.  అధికారులు కింది ఆయకట్టుకు నీరు అందేలా చర్యలు తీసుకోవాలని, పనులలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని స్పష్టం చేశారు. రైతులు అధికారుల సూచనలను పాటించాలని అన్నారు. పంటలకు సరిపడా నీరు అందిన తరువాతే చెరువులు నింపుకోవాలని సూచించారు.  అలీసాగర్ లిఫ్ట్ కెనాల్ నుంచి సాగునీటిని అందిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో నవీపేట్ మండల నాయకులు, రైతులు పాల్గొన్నారు.