Batukammanews
Newspaper Banner
Date of Publish : 16 July 2026, 5:33 pm Posted by : ramakrishna

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన నీటి పారుదల శాఖ అధికారులు

 

వెబ్ డెస్క్, బతుకమ్మ :

 

పౌల్ట్రీ ఫారం ఏర్పాటుకు నీటి పారుదల శాఖ నుంచి ఎన్ ఓసి ఇవ్వడానికి లక్ష రూపాయల లంచం డిమాండ్ చేసి రూ. 60 వేలు తీసుకుంటున్న నీటి పారుదల శాఖ అధికారులు ఏసీబీకి చిక్కారు. ఆదిలాబాద్ కు చెందిన ఒక వ్యక్తి పౌల్ట్రీ ఫారం ఏర్పాటుకు నీటి పారుదల శాఖకు ఎన్ఓసీ కి దరఖాస్తు చేసుకున్నాడు. ఎన్ఓసీ జారీ కోసం ఆదిలాబాద్ నీటి పారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఈఈ) రాథోడ్ విట్టల్, అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ) రమేష్ లు బాధితుడి నుంచి లక్ష రూపాయల లంచం డిమాండ్ చేశారు. చివరకు రూ.60 వేలు ఇస్తేనే ఎన్ఓసీ జారీ చేస్తామని దిగివచ్చారు. లంచం ఇవ్వవద్దని బాధితుడు ఏసీబీ ని ఆశ్రయించాడు. గురువారం ఆదిలాబాద్ నీటి పారుదల శాఖ కార్యాలయంలో ఈఈ రాథోడ్ విట్టల్, ఏఈ రమేష్ లు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యండెడ్ గా పట్టుకున్నారు. కార్యాలయంలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఇద్దరిని అరెస్ట్ చేసి కరీంనగర్ ఏసీబీ కోర్టులో హాజరు పరుస్తామని అధికారులు తెలిపారు.

 

Irrigation Department officials caught by the ACB while accepting a bribe.