నాగుల్ గావ్ గ్రామపంచాయతీలో అవకతవకలు
బతుకమ్మ, జుక్కల్ : నాగుల్ గావ్ గ్రామపంచాయతీలో అవకతవకలు జరుగుతున్నాయని గ్రామస్తులు కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ (సీసీఆర్) సంస్థను సంప్రదించారు. దీనిపై స్పందించిన సీసీఆర్ సభ్యులు రికార్డు వెరిఫికేషన్ నిర్వహించారు. తనిఖీలలో అనేక లోటుపాట్లు కనిపించాయి. నాగుల్ గావ్ గ్రామపంచాయతీలో ఉండాల్సిన రిజిస్టర్లలో సగం కంటే ఎక్కువ రిజిస్టర్లు లేవని పంచాయతీ సెక్రటరీ రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు. లభించిన రిజిస్టర్లలో అనేక తప్పులు క్షుణంగా పరిశీలించారు. సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) ద్వారా గత 10 సంవత్సరాల రికార్డులను పరిశీలించాలని కోరినా, కేవలం...