Batukammanews
Newspaper Banner
Date of Publish : 23 April 2026, 7:37 pm Posted by : ramakrishna

జిల్లా ప్రధాన న్యాయమూర్తిని కలిసిన ఐపిఎస్ అధికారి నగ్రాలే శుభం ప్రకాష్

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

 

నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనరేట్ లో డిప్యూటీ పోలీస్ కమిషనర్ (అడ్మిన్) గా నూతనంగా విధులలో చేరిన ఐపిఎస్ అధికారి నగ్రాలే శుభం ప్రకాష్ గురువారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవ అధికార సంస్థ చైర్ పర్సన్ జి. వి. ఎన్ భారత లక్ష్మీ ని మర్యాద పూర్వకంగా కలిశారు. జిల్లాకోర్టు సముదాయంలోని జిల్లాజడ్జి ఛాంబర్ లో ఆమెకు పూలమొక్కను అందజేశారు. ఒక మొక్క ప్రకృతి వాతావరణానికి, మనుషులకు ఎంత మేలు చేస్తుందో అంతకంటే ఎక్కువగా సమాజానికి మేలు చేద్దామని జిల్లాజడ్జి భారత లక్ష్మీ అన్నారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆ అవకాశాన్ని కల్పిస్తున్నదని తెలిపారు. సమాజపు బాగోగుల పట్ల న్యాయ, పోలీస్ వ్యవస్థలకు గురుతర బాధ్యతలు ఉన్నాయని అవి జాతీయ న్యాయసేవల ప్రాధికార సంస్థ నాల్సా ద్వారా మాత్రమే సమకూరుతాయని ఆమె పేర్కొన్నారు. నాల్సా లక్ష్యానికి అనుగుణంగా కలిసి నడుద్దామని అన్నారు.