Batukammanews
Newspaper Banner
Date of Publish : 15 October 2026, 5:26 pm Posted by : ramakrishna

సిఎస్ఆర్ లో భాగంగా జిజిహెచ్ కు రూ.65 లక్షల పరికరాలు డొనేట్ చేసిన ఐఓసీ

 

. . . వైద్య పరికరాలను ప్రారంభించిన ప్రిన్సిపాల్, సూపరింటెండెంట్

 నిజామాబాద్ సిటీ, బతుకమ్మ:

నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి అవసరమైన రూ.65 లక్షల విలువైన వైధ్య పరికరాలను నిర్మాణ్ ఆర్గనైజేషన్ సహకారంతో  సిఎస్ఆర్ క్రింద ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సంస్థ సమకూర్చింది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ లో భాగంగా ఐఓసి విరాళాలతో కొనుగోలు చేసిన వైద్య పరికరాలను గురువారం జిజిహెచ్  ఆర్థోపెడిక్ ఆపరేషన్ థియేటర్, లేబర్ రూం లలో బిగించిన పరికరాల ను ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ ప్రో. డాక్టర్ క్రిష్ణ మోహన్, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాములు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… సిఎస్ఆర్ ఫండ్స్ కోసం ఐఓసీ అధికారులు జిజిహెచ్ పిడియాట్రిక్స్ విభాగం అధిపతి, మాజీ జిజిహెచ్ సూపరింటేండేంట్ డాక్టర్ శ్రీనివాస్, జనరల్ మెడిసిన్ విభాగం అధిపతి ప్రొఫెసర్ జలగం తిరుపతిరావు పర్యవేక్షణలో మంజూరు అయ్యాయని తెలిపారు.

IOC donates equipment worth Rs 65 lakh to GGH as part of CSR

ఐఓసి ద్వార సిఎస్ఆర్ క్రింద జీజీహెచ్ కు కొత్తగా 3 వెంటిలేటర్లు, 3 బబూల్ సిపాప్ పరికరాలు, 1 సిఆర్మ్ యంత్రం, 5 సిఆర్ క్యాసెట్లు, 6 ప్రసవ పట్టికలు,2 కార్డియో టోగ్రఫీ మిషన్ లు  వైద్య పరికరాలు అందాయన్నారు. ఈ వైద్య పరికరాల వల్ల శస్త్ర చికిత్సలు, ప్రసూతి సేవలు, నవజాత శిశువుల సంరక్షణ, ఇతర వైద్య సేవలు సమర్థవంతంగా అందుతాయని అన్నారు. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి సిఎస్ఆర్ కింద రూ 65 లక్షల పరికరాలు అందచేసిన ఐఓసీ, నిర్మాణ్ ఆర్గనైజేషన్ లను ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అర్ధో హెచ్ ఓ డి డాక్టర్ రవి కిరణ్, పిడియాట్రిక్స్ విభాగం అధిపతి డాక్టర్ శ్రీకాంత్,  ప్రసుతి, స్త్రీ రోగ విభాగం అధిపతి డా టి లక్ష్మీ ప్రసన్న తదితర వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

IOC donates equipment worth Rs 65 lakh to GGH as part of CSR