పీసీసీ అధ్యక్షుడి కి జాతీయ ఓబీసీ మహాసభల ఆహ్వాన పత్రిక
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్‌లో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌ను బీసీ సంక్షేమ సంఘం నిజామాబాద్ జిల్లా నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి, ఆగస్టు 7న నిర్వహించనున్న 11వ జాతీయ ఓబీసీ మహాసభల ఆహ్వాన కరపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ మాట్లాడుతూ, మండల్ కమిషన్ సిఫార్సులు అమలులోకి వచ్చిన రోజైన ఆగస్టు 7ను పురస్కరించుకుని ప్రతి ఏడాది జాతీయ స్థాయిలో...