ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి ఉత్సవాల సందర్భంగా ఎమ్మెల్యే కి ఆహ్వానం
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఛత్రపతి శివాజీ మహారాజ్ 396వ జయంతి ఉత్సవాలను నగరంలో గురువారం ఘనంగా నిర్వహించనున్నట్లు జయంతి ఉత్సవ నిర్వాహకులు తెలిపారు. ఈ ఉత్సవాలను వివిధ సంఘాలు, ఆర్య మరాఠా యువత, హిందూ బంధు మిత్రుల ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్టు వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా జయంతి ఉత్సవ నిర్వాహకులు నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణని మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రం అందజేశారు. అలాగే కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా విచ్చేసి పాల్గొని ఆశీర్వదించాలని వారు కోరారు. గురువారం మధ్యాహ్నం...