Batukammanews
Newspaper Banner
Date of Publish : 22 February 2025, 2:02 pm Posted by : ramakrishna

కేసీఆర్ కు ఆహ్వానం

వెబ్ న్యూస్, బతుకమ్మ :  యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవస్థాన స్వర్ణ విమాన గోపుర మహాకుంభాభిషేకం, అనంతరం జరిగే ఉత్సవాలకు రావాలని మాజీ సీఎం కేసీఆర్ ను దేవాలయ అధికారులు, పూజారులు ఆహ్వానించారు.  కేసీఆర్ ను ఎర్రవల్లిలోని ఆయన నివాసంలో ఆలయ ప్రధానార్చకులు వెంకటేశ్వరాచార్యులు, డీఈవో భాస్కర్ తదితరులు కలిసి ఆహ్వాన  పత్రికను అందజేశారు. ఈనెల 23న మహాకుంభాభిషేకం, మార్చి 1 నుంచి 11 వరకు బ్రహోత్సవాలు జరుగుతాయని తెలిపారు.