నగర మున్సిపల్ కమిషనర్‌కు జగన్నాథ రథయాత్ర ఆహ్వానం
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : నగరంలోని ఇస్కాన్ కంఠేశ్వర్ కేంద్రం ఆధ్వర్యంలో ఈ నెల 24వ తేదీన నిర్వహించనున్న శ్రీ జగన్నాథ రథయాత్ర మహోత్సవానికి నగర మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ దిలీప్ కుమార్‌కు ఇస్కాన్ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా కమిషనర్ దిలీప్ కుమార్ మాట్లాడుతూ, ఇస్కాన్ కంఠేశ్వర్ కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు, భక్తి, ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో మంచి ఆదరణ పొందుతున్నాయని అన్నారు. శ్రీ జగన్నాథ రథయాత్ర మహోత్సవం భక్తి భావాన్ని పెంపొందించే...