Batukammanews
Newspaper Banner
Date of Publish : 11 July 2026, 6:29 pm Posted by : ramakrishna

నగర మున్సిపల్ కమిషనర్‌కు జగన్నాథ రథయాత్ర ఆహ్వానం

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

నగరంలోని ఇస్కాన్ కంఠేశ్వర్ కేంద్రం ఆధ్వర్యంలో ఈ నెల 24వ తేదీన నిర్వహించనున్న శ్రీ జగన్నాథ రథయాత్ర మహోత్సవానికి నగర మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ దిలీప్ కుమార్‌కు ఇస్కాన్ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా కమిషనర్ దిలీప్ కుమార్ మాట్లాడుతూ, ఇస్కాన్ కంఠేశ్వర్ కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు, భక్తి, ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో మంచి ఆదరణ పొందుతున్నాయని అన్నారు. శ్రీ జగన్నాథ రథయాత్ర మహోత్సవం భక్తి భావాన్ని పెంపొందించే విశిష్ట కార్యక్రమమని పేర్కొంటూ, నగర ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని భగవంతుని కృపకు పాత్రులు కావాలని ఆకాంక్షించారు. ఇస్కాన్ ప్రతినిధులు రథయాత్ర విశేషాలను కమిషనర్‌కు వివరించి, కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి నగర ప్రజల సహకారం కోరారు. ఈ కార్యక్రమంలో మాదాసు స్వామి యాదవ్, నితాయ్ చంద్ ప్రభు, సుమంత్ ప్రభు, సూర్య ప్రభు, రోహిత్ ప్రభు తదితరులు పాల్గొన్నారు.