Batukammanews
Newspaper Banner
Date of Publish : 02 February 2025, 5:50 pm Posted by : ramakrishna

వెంకటేశ్వర స్వామి ఆలయ భూమి పూజకు ఆహ్వానం

ఆర్మూర్, బతుకమ్మ : ఆలూరు మండల కేంద్రంలో నిర్మించనున్న వేయి నామాల వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణ భూమి పూజ కార్యక్రమానికి హాజరు కావాలని కాంగ్రెస్ నియోజకవర్గం ఇంచార్జి వినయ్ రెడ్డికి, ఎమ్మెల్యే రాకేష్ రెడ్డికి ఆదివారం ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు ఆహ్వానం అందించారు.  ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ, ఆలయ ప్రాంగణం స్వయంభుగా వెలసిన పవిత్ర క్షేత్రం కావడంతో, భక్తుల విశ్వాసాన్ని మరింత పెంచేలా ఆలయ నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేయడానికి దాతల సహకారం ఎంతో అవసరమని సూచించారు. ఆలయ నిర్మాణానికి విరాళాలు అందించాలని భక్తులను కోరారు. ఈ కార్యక్రమంలో ఆలూర్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ముక్కెర విజయ్, దుమజీ శ్రీనివాస్,గాండ్ల రమేష్, మూలకిడి శ్రీనివాస్ రెడ్డి, పెర్కిట్ రమేష్, తోక శ్రీను, మల్లయ్య, మోహన్, లక్ష్మణ్, వైస్ మల్లారెడ్డి, సంజీవ్, ఉదయ్, బీరయ్య తదితరులు పాల్గొన్నారు.

Invitation to Bhoomi Pooja of Lord Venkateswara Swamy Temple