Batukammanews
Newspaper Banner
Date of Publish : 02 September 2024, 5:36 pm Posted by : ramakrishna

అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

బతుకమ్మ,మోర్తాడ్:  మోర్తాడ్ డిగ్రీ కళాశాలలో బోధించుటకు ఈ క్రింది సబ్జెక్టులలో గెస్ట్ లెక్చరర్ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ టి.పెద్దన్న ఒక ప్రకటనలో తెలిపారు సంబంధిత సబ్జెక్టులో పీజీలో 55%, నెట్, స్లేట్, పీ.హెచ్.డీ అర్హత బోధనా అనుభవం కలవారికి తగిన ప్రాధాన్యత ఇవ్వబడునని పేర్కొన్నారు. దరఖాస్తు చేసే వారు తమ దరఖాస్తులు తేదీ 5.9.2024 గురువారం సాయంత్రం నాలుగు గంటల లోపు మోర్తాడ్ డిగ్రీ కళాశాలలో అందించగలరని తెలిపారు. ఇంటర్వ్యూలు తేదీ 6.9.2024 శుక్రవారం గిరి రాజ్ ప్రభుత్వ కళాశాల నిజామాబాద్ లో నిర్వహించబడతాయని అన్నారు. తెలుగు, ఆంగ్లం, కంప్యూటర్ సైన్స్, కెమిస్ట్రీ సబ్జెట్లలో ఒకొక్క పోస్ట్ ఉన్నట్లు తెలిపారు.