Batukammanews
Newspaper Banner
Date of Publish : 24 December 2024, 4:45 pm Posted by : ramakrishna

అతిథి అధ్యాపక పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

బతుకమ్మ, మద్నూర్:   ప్రభుత్వ డిగ్రీ కళాశాల బిచ్కుంద,మద్నూర్ కళాశాలలో  అతిథి అధ్యాపక పోస్టుల భర్తీకి దరఖాస్తులకు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ కే .అశోక్ ఒక ప్రకటనలో తెలిపారు. బిచ్కుంద డిగ్రీ కళాశాలలో ఆంగ్లం-1, అర్థశాస్త్రం-1 ఖాళీలు ఉన్నాయని తెలిపారు. మద్నూర్ డిగ్రీ కళాశాలలో తెలుగు -1, ఆంగ్లం-1, బాటని-1, జువాలజీ-1, కెమిస్ట్రీ-1 ఖాళీలు ఉన్నయని  తెలిపారు. సంబంధిత సబ్జెక్టు పీజీలో 55% మార్కులు అర్హత కలిగి  ఉండాలని అన్నారు. నెట్, సెట్, పీహెచ్డీ అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబడునని తెలిపారు. విద్యా అర్హత పత్రాలు ఈనెల 27మధ్యాహ్నం మూడు గంటలలోపు బిచ్కుంద ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సమర్పించాలని తెలిపారు.