Batukammanews
Newspaper Banner
Date of Publish : 26 June 2026, 5:05 pm Posted by : ramakrishna

జగన్నాథ రథయాత్రకు రావాలని ఎస్సైకి ఆహ్వానం

 

. . . భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలి

 

ఇందల్వాయి, బతుకమ్మ :

 

ఇందల్వాయి మండల కేంద్రంలోని జులై 18 న ఇందల్వాయి గ్రామంలో శ్రీ జగన్నాథ రథయాత్ర మహోత్సవం సందర్భంగా ఇందల్వాయి ఎస్సై భూక్య సుమలతకు ఇందల్వాయి జగన్నాథ రథయాత్ర మహోత్సవ కమిటీ సభ్యులు ఆహ్వాన పత్రికను అందజేశారు. రథయాత్ర మహోత్సవానికి హాజరు కావాల్సిందిగా కోరారు. గ్రామ సర్పంచ్ లోకని గంగామణి గంగారం, ఉప సర్పంచ్ మోత్కూరి శ్రీనివాస్ గౌడ్, గ్రామాభివృద్ధి కమిటీ చైర్మన్ రియాజ్, తదితరులకు సైతం ఆహ్వాన పత్రికను అందజేశారు. ఇట్టి రథయాత్ర మహోత్సవాన్ని భక్తులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారి ఆశీస్సులు పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో రథయాత్ర మహోత్సవ కమిటీ సభ్యులు, గ్రామ సర్పంచ్ లోకని గంగామణి గంగారం, ఉప సర్పంచ్ మోత్కూరి శ్రీనివాస్ గౌడ్, గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ రియాజ్, కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు నవీన్ గౌడ్, సదర్ పెద్దమనుషులు, గ్రామస్తులు మారంపల్లి శ్యాంసుందర్, మాజీ సర్పంచ్ దశరథ్, నారాయణ, రాములు, కవన్ గౌడ్, సుదర్శన్ పెద్దలు, నరేష్, సత్యం, మాణిక్యం, తదితరులు పాల్గొన్నారు.