Batukammanews
Newspaper Banner
Date of Publish : 19 December 2025, 1:30 pm Posted by : ramakrishna

మానేరు చెక్ డ్యామ్ ధ్వంసం ఘటనపై కొనసాగుతున్న దర్యాప్తు

భూపాలపల్లి, బతుకమ్మ :  భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలంలో మానేరు చెక్ డ్యామ్ ధ్వంసం ఘటనపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది.  400 మీటర్ల పొడవున్న చెక్ డ్యామ్ లో సుమారు 150 మీటర్లు ధ్వంసమైంది.  గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారని ఇరిగేషన్ శాఖ అధికారులు అనుమానిస్తున్నారు.  డౌన్ స్ట్రీమ్, అప్ స్ట్రీమ్ రెండు వైపులా చెక్ డ్యామ్ భాగాలు పడిపోవడంతో అనుమానాలు బలపడుతున్నాయి.  చెక్ డ్యామ్ వద్ద బాంబ్ డిస్పోజబుల్ బృందంతో  పోలీస్ శాఖ తనిఖీలు నిర్వహిస్తోంది.