పడగల్ ‘సహకార’ కుంభకోణంపై విచారణ
. పడగల్ సొసైటీలో రైతుల పేరుతో రుణాలు తీసుకున్న సెక్రెటరీ . రుణమాఫీ ప్రక్రియతో వెలుగులోకి వచ్చిన వైనం . సెక్రటరీ బదిలీపై వెళ్లిన తరువాత మోసపోయినట్లు తెలుసుకున్న రైతులు వేల్పూర్, బతుకమ్మ: జిల్లా సహకార శాఖలో మరో కుంభకోణం వెలుగుచూసింది. పడగల్ సొసైటీ సెక్రటరీగా పని చేసి వెళ్లిన దయాసాగర్ తమ పేర్లపై రుణాలు తీసుకున్నాడని కోమన్ పల్లి, కుకునూర్, అంక్సాపూర్, పోచంపల్లి, హనుమాన్ నగర్ గ్రామాలకు చెందిన పలువురు రైతులు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో జిల్లా కో ఆపరేటీవ్...