Batukammanews
Newspaper Banner
Date of Publish : 10 June 2025, 4:32 pm Posted by : ramakrishna

విచారణ అధికారులు వాస్తవాలను బహిర్గతం చేయాలి

  • బోనస్ కాజేసిన వారిపై చర్యలు తీసుకోవాలి
  • సిపిఐ నాయకుల డిమాండ్..

 

బతుకమ్మ, కోటగిరి :  బోగస్ బోనస్ పై విచారణ అధికారులు వెంటనే వాస్తవాలను బహిర్గతం చేసిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు. కోటగిరి మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్ లో సిపిఐ మండల మహాసభ నల్ల గంగాధర్ అధ్యక్షతన  నిర్వహించారి. ఈ సమావేశానికి ముఖ్య అతిధిలుగా సిపిఐ జిల్లా కార్యదర్శి పి.సుధాకర్, సిపిఐ జిల్లా నాయకులు వై.ఓమయ్య పాల్గొన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ…. కోటగిరి సొసైటీలో గత సంవత్సరం ఖరీఫ్ సీజన్లో జరిగిన అవినీతిపై నిగ్గు తేల్చి ప్రభుత్వ ప్రజాధనాన్ని తిరిగి చెల్లించుకోవడంతోపాటు, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన వారి పేర్లు అధికారులు బహిర్గతం చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సంవత్సరం దాటుతున్న అధికారులు నిర్లక్ష్యం చేయుట మూలంగా  అధికారులపై రైతులకు అనుమానం వస్తున్నదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం దేశంలో అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఒక్కరి ఖాతాలో 15 లక్షలు వేస్తామని ప్రజలకు ఇస్తానన్నటువంటి హామీ 12 సంవత్సరాల అవుతున్న ఇప్పటికి వారి ఖాతాలలో వేయలేదని అన్నారు ప్రజల ఎజెండా కోసం జీవితాలు త్యాగం చేస్తున్న మావోయిస్టులు చర్చలకు సిద్ధమని తెలిపిన ఆపరేషన్ కగార్ పేరుతో చంపడం అన్యాయమని అన్నారు. కార్పొరేట్ సంస్థలకు ఖనిజ సంపద అప్పనంగా అప్పజెప్పడానికె అడవులను ఖాళీ చేస్తున్నారని అన్నారు రాష్ట్రంలో ప్రజా పాలన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చినటువంటి ఆరు హామీలను అమలు చేయాలని అన్నారు ప్రజా సమస్యలైనా రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు అర్హులందరికీ ఇవ్వాలని కోరారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి దత్తత గ్రామమైన కోటగిరిలో నూతన బస్టాండ్ ను నిర్మించి విద్యార్థుల సమస్యను పరిష్కరించాలని అన్నారు.  ఈ సందర్భంగా సిపిఐ మండల నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది సిపిఐ మండల కార్యదర్శి గా అంబాటి విట్టల్ గౌడ్, మండల నాయకులు నల్ల గంగాధర్, రాజు,బర్ల సునీల్ కుమార్, బుడాల.రాములు, మల్లేష్ గౌడ్, వెంకటేష్, గోపాల్ రావు లతో నూతన కమిటీని ఎన్నుకున్నారు.