త్రిలింగేశ్వర ఆలయ క్యాలెండర్ ఆవిష్కరణ
బతుకమ్మ : నాగిరెడ్డిపేట : నూతన సంవత్సరం సందర్భంగా మండలంలోని తాండూర్ గ్రామంలో త్రిలింగేశ్వర ఆలయంలో మాజీ జెడ్పిటిసి, రాష్ట్ర జెడ్పిటిసిల ఫోరం మాజీ ప్రధాన కార్యదర్శి ఉమన్నగారి మనోహర్ రెడ్డి త్రిలింగేశ్వర ఆలయ నూతన సంవత్సర క్యాలెండర్ ను బుధవారం ఆవిష్కరించారు. ముందుగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాజీ జెడ్పిటిసి ఉమన్నగారి మనోహర్ రెడ్డి తన సొంత డబ్బులతో త్రిలింగేశ్వర ఆలయానికి సంబంధించిన 2025 సంవత్సరం క్యాలెండర్లను తయారు చేయించి గ్రామస్తులతో మండల నాయకులతో కలిసి ఆవిష్కరించారు.ఈ సందర్భంగా మనోహర్ రెడ్డి...