బతుకమ్మ : నాగిరెడ్డిపేట : నూతన సంవత్సరం సందర్భంగా మండలంలోని తాండూర్ గ్రామంలో త్రిలింగేశ్వర ఆలయంలో మాజీ జెడ్పిటిసి, రాష్ట్ర జెడ్పిటిసిల ఫోరం మాజీ ప్రధాన కార్యదర్శి ఉమన్నగారి మనోహర్ రెడ్డి త్రిలింగేశ్వర ఆలయ నూతన సంవత్సర క్యాలెండర్ ను బుధవారం ఆవిష్కరించారు. ముందుగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాజీ జెడ్పిటిసి ఉమన్నగారి మనోహర్ రెడ్డి తన సొంత డబ్బులతో త్రిలింగేశ్వర ఆలయానికి సంబంధించిన 2025 సంవత్సరం క్యాలెండర్లను తయారు చేయించి గ్రామస్తులతో మండల నాయకులతో కలిసి ఆవిష్కరించారు.ఈ సందర్భంగా మనోహర్ రెడ్డి మాట్లాడుతూ తనవంతు భాగంగా త్రిలింగేశ్వర ఆలయం చరిత్రను క్యాలెండర్ రూపంలో ముద్రించి నాలుగు మూలలకు తెలిసే విధంగా క్యాలెండర్ ను తయారు చేయించానన్నారు. సుమారు 5000 క్యాలెండర్లను త్రిలింగేశ్వర ఆలయ ప్రాంగణంలో ఆవిష్కరించడం జరిగిందన్నారు. త్రిలింగేశ్వర ఆలయ చరిత్రను లిఖితపూర్వకంగా ముద్రించి నాలుగు మూలలకు తెలియజేయడమే తన లక్ష్యమన్నారు.ఇలాగైనా త్రిలింగేశ్వర ఆలయం చరిత్ర నాలుగు మూలలకు వ్యాపించి భక్తులు,ప్రజలు ఎక్కువ సంఖ్యలో సందర్శిస్తారని తన ఉద్దేశమన్నారు. త్రిలింగేశ్వర ఆలయ చరిత్ర క్యాలెండర్ రూపంలో తయారు చేయించడం శివుడిచ్చిన ఆజ్ఞ అని భావిస్తున్నానన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు దత్తు నాయకులు ధనుంజయ్, దివిటి కిష్టయ్య, శ్యామ్ రావు, నరసింహారెడ్డి, బన్సీ తదితరులు పాల్గొన్నారు.