తపస్ క్యాలెండర్ ఆవిష్కరణ

నిజామాబాద్, బతుకమ్మ: నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గురువారం తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తపస్ 2025 డైరీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విద్యారంగ సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పరళీ కృష్ణవేణి, బట్టు బద్రీనాథ్, రాష్ట్ర బాధ్యులు పాపగారి రామకృష్ణారెడ్డి, కీర్తి సుదర్శన్, జిల్లా బాధ్యులు రాజేష్, చిరంజీవి, అమీనా, రాచర్ల గంగాధర్, పోరెడ్డి శ్రీనివాస్, శివకుమార్, చందూరు బాధ్యులు శ్రీధర్, రామానుజ చారీ, నవీపేట్ బాద్యులు పురుషోత్తం, మాక్లూర్ బాద్యులు నీరజ పాల్గొన్నారు.