సింగిల్ డోనర్ ప్లేట్‌లెట్స్ యంత్రం ఆవిష్కరణ
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలో సింగిల్ డోనర్ ప్లేట్ లెట్స్(ఎస్డీపీ) యంత్రాన్ని సూపరింటెండెంట్ ప్రతిమారాజ్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ఎస్డీపీ యంత్రం ఏర్పాటుతో రోగి అవసరాన్ని బట్టి ఒకే దాత నుంచి ప్లేట్‌లెట్లను సేకరించడం సులభంగా సాధ్యమవుతుందని అన్నారు. ఈ యంత్రం ఖరీదు సుమారు రూ.40లక్షల వరకు ఉంటుందన్నారు. ఒక సారి ప్లేట్ లెట్లు తయారు చేయడానికి ఉపయోగించే పరికరాల విలువ సుమారు రూ.15వేల వరకు ఉంటుందన్నారు. ప్లేట్‌లెట్లు ఒక గంటలో...