రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండల కేంద్రంలోని సమీకృత మండల భవన సముదాయ కార్యాలయం ఎదుట మంగళవారం తహసిల్దార్ తారాబాయి, ఎంపీడివో సురేష్ బాబు చేతుల మీదుగా పీఆర్ టీయు నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ శ్రీనివాస్, పి ఆర్ టి యు అధ్యక్షులు వై. విట్టల్ రెడ్డి, మండల పిఆర్టియు కార్యదర్శి ఎండి. దస్తగిరి, రాష్ట్ర కార్యదర్శులు వి. రమేష్, ఇంతియాజ్, అహ్మద్, మండల బాధ్యులు వీరేశం, ఉపాధ్యాయులు గంగారం, కోటేశ్వరరావు, మోడల్ పాఠశాల హెచ్ ఎం. చెన్నప్ప, ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.