Batukammanews
Newspaper Banner
Date of Publish : 02 December 2024, 7:53 pm Posted by : ramakrishna

ఛలో ఢిల్లీ కరపత్రాలు, పోస్టర్ల ఆవిష్కరణ

బతుకమ్మ,ముప్కాల్: తెలంగాణ బిసి సంక్షేమ సంఘం అధ్వర్యంలో ముప్కాల్ మండల కేంద్రంలో సోమవారం రోజు ఉదయం చలో ఢిల్లీ కరపత్రల పోస్టర్ల ఆవిష్కరణ కార్యక్రమంను చేపట్టారు. పోస్టర్ల ఆవిష్కరణ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి దాసరి మూర్తి మాట్లాడుతూ చట్టసభల్లో బీసీ రిజర్వేషన్లు, దేశవ్యాప్తంగా సమగ్ర కులగణన, మహిళా రిజర్వేషన్లలో ఓబిసి మహిళలకు సబ్ కోట, విద్య ఉద్యోగ రంగాల్లో బీసీలకు 50% శాతం రిజర్వేషన్లు కల్పించాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వ కేబినెట్ లో ప్రత్యేక బిసి మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని, బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు, బీసీ విద్యార్థులకు 100% ఫీజు రియంబర్స్ మెంట్, జాతీయస్థాయి ఓబీసీ సబ్ ప్లాన్, సాధనల కోసం ఈ నెల16,17,18 తేదీల్లో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చేపట్టే చలో ఢిల్లీ కార్యక్రమం విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఛలో ఢిల్లీ జంతర్ మంతర్ వద్దకు బీసీ మేధావులు, బీసీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో ముప్కాల్ బిసి సంక్షేమ సంఘం మండల అధ్యక్షులు గోపి రాము, ముప్కాల్ మండల ఉపాధ్యక్షులు బొంబాయి రాజు, మహేందర్, దేవరాజ్, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.