మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి
టీ ఎస్ న్యాబ్ డీఎస్పీ సోమనాథం బతుకమ్మ, నిజామాబాద్ : యువత గంజాయి, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని టీ ఎస్ న్యాబ్ డీఎస్పీ సోమనాథం అన్నారు. నగరంలో శుక్రవారం గంజాయి, మత్తు పదార్థాల నియంత్రణ పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. యువత చెడు వ్యసనాలకు బానిసై జీవితాన్ని నాశనం చేసుకోవధ్ధన్నారు. మత్తు పదార్థాలు సేవించి కొందరు నేరాలకు పాల్పడుతున్నారని అన్నారు. మత్తుకు అలవాటు పడి జీవితాన్ని నాశనం చేసుకోవద్దన్నారు....