రోబోటిక్ మోకాలి మార్పిడి శస్త్రచికిత్స లబ్ధిదారుల ఆత్మీయ సమావేశం
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఇటీవల పూర్తయిన రోబోటిక్ మోకాలి మార్పిడి శస్త్రచికిత్స లబ్ధిదారుల ఆత్మీయ సమావేశం గురువారం నోవా లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌లో సీనియర్ రోబోటిక్ సర్జన్ డాక్టర్ నవీన్ మాలు అధ్యక్షతన నిర్వహించారు. మొదట జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం రోబోటిక్ సర్జరీ లబ్ధిదారులు తమ అనుభవాలను పంచుకున్నారు. శస్త్రచికిత్సకు ముందు, తరువాత వారి జీవనశైలిని వివరించారు. కొందరు రోబోటిక్ సర్జరీని ఒక వరం అని అభివర్ణించగా, మరికొందరు దీనిని చాలా ఆహ్లాదకరమైన శస్త్రచికిత్సగా అభివర్ణించారు. సమావేశాన్ని...