మహిళను కత్తితో బెదిరించి దోపిడీ చేసిన అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్.

బాన్సువాడ, బతుకమ్మ :   బీర్కూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళను కత్తితో బెదిరించి బంగారు ఆభరణాలు దోచుకెళ్లిన అంతర్రాష్ట్ర నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు బాన్సువాడ డీఎస్పీ విఠల్ రెడ్డి సోమవారం వెల్లడించిన వివరాల ప్రకారం బీర్కూర్ మండలం బరంగేడ్గి గ్రామానికి చెందిన బోయి అనూషబాయి డిసెంబర్ 2న మార్కెట్ ముగించుకుని ఇంటికి వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తి బైక్ పై వచ్చి లిఫ్ట్ ఇస్తానని నమ్మించాడు. ఆమెను బైక్‌పై ఎక్కించుకున్న నిందితుడు బైరాపూర్ ఎక్స్ రోడ్డు సమీపంలో బైక్...