Batukammanews
Newspaper Banner
Date of Publish : 27 January 2025, 5:37 pm Posted by : ramakrishna

అంతర్రాష్ట్ర షట్టర్ లిఫ్టింగ్ ముఠా నాయకుడి అరెస్ట్

  • ఒక్కడి అరెస్టుతో 11 షట్టర్ లిఫ్టింగ్ కేసుల కొలిక్కి

 

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: నిజామాబాద్ జిల్లా కేంద్రంతో పాటు ఇతర ప్రాంతలలో షట్టర్ లను ధ్వంసం చేసి చోరీలకు పాల్పడుతున్న అంతర్ ర్రాష్ట్ర షట్టర్ లిఫ్టింగ్ ముఠా నాయకుడిని అరెస్టు చేసినట్లు నిజామాబాద్ ఏసీసీ రాజా వెంకట్ రెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఏసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. మహరాష్ట్ర్టలోని పర్బని  కోత్వాల్ పోలీస్ స్టేషన్ ప్రాంతానికి చెందిన లారీ డ్రైవర్ కరణ్ సింగ్ తనతో పాటు లాధూర్ కు చెందిన కరణ్ సింగ్ బాపూరీ, జాల్నాకు చెందిన మనోహర్ సింగ్, లాథూర్ కు చెందిన అజయ్ సింగ్ లతో పాటు ముఠాగా ఏర్పడి దొంగతనాలకు పాల్పడ్డారని తెలిపారు. గత ఏడాది జనవరి నుంచి డిసెంబర్ వరకు నిజామాబాద్ నగరంలోని 11 షట్టర్ లిఫ్టింగ్ దొంగతనాలకు పాల్పడ్డారని తెలిపారు. నిజామాబాద్ నగరంలోని జవహర్ రోడ్డు పుసల గల్లిలో జరిగిన వరుస దొంగతనాల నేపథ్యంలో నిజామాబాద్ ఒకటవ టౌన్ ఎస్ హెచ్ఓ రఘుపతి ఆధ్వర్యంలో ప్రత్యేక టీంను ఏర్పాటు చేసి ముఠా నాయకుడు కరణ్ సింగ్ ను అరెస్టు చేశామని తెలిపారు. మిగిత ముఠా సభ్యులు పరారీలో ఉన్నారని తెలిపారు. అతని వద్ధ షట్టర్ లిప్టింగ్ కు ఉపయోగించే కట్టర్ తో పాటు రాడ్ ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పరారీలో ఉన్న వారికోసం ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసినట్లు పేర్కోన్నారు.

Interstate shutter lifting gang leader arrested