కమ్మర్ పల్లి, బతుకమ్మ : బాల్కొండ నియోజకవర్గంలో గురువారం ఉదయం భారీగా పొగ మంచు కమ్మడంతో తీవ్ర అంతరాయం కలిగింది. ఉదయం 8 గంటల వరకు మంచు పొగ కమ్మడం తో వాహనదారులు దారి కనిపించక రాకపోకలకు తీవ్ర ఇబ్బందిని ఎదురుకొన్నారు. పొగ మంచు తో పాటు వాతావరణం చల్లబడి, ఈదర గాలులు వీచడంతో ప్రజలు ఇబ్బందులను ఎదురుకొన్నారు.
