Batukammanews
Newspaper Banner
Date of Publish : 21 June 2025, 3:47 pm Posted by : ramakrishna

గ్లోబల్ కిడ్స్ మోడల్ స్కూల్ లో అంతర్జాతీయ యోగా దినోత్సవం

బతుకమ్మ, వేల్పూర్ :-మండలంలోని గ్లోబల్ కిడ్స్ స్కూల్ లో యోగ దినోత్సవం నిర్వహించారు. ఇందులో భాగంగా యోగ టీచర్ మమత పిల్లలకు యోగ నేర్పుతూ ప్రతి రోజూ ఉదయం సూర్యనమస్కారాలు, అసానాలు చేయాలని ఆరోగ్యం గా ఉండటానికి కావలసిన శారీరక వ్యాయామం చేయడం వల్ల మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ముందుంటాము అని పిల్లల్ని ప్రతి రోజూ నీళ్ళు బాగా తాగాలని చెప్పారు. ఇంటర్నేషనల్ యోగ దినోత్సవం జాతీయ స్థాయిలో నిర్వహించాలని ప్రతి సంవత్సరం జూన్ నెలలో 21 వ తేదీన జరుపుకుంటున్నాము అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్లోబల్ కిడ్స్ స్కూల్ ప్రిన్సిపాల్ సురేష్, ఇంచార్జ్ శ్యామ్, అస్లాం అఖిల స్కూల్ స్టాఫ్ పాల్గొన్నారు.