Batukammanews
Newspaper Banner
Date of Publish : 21 June 2025, 6:39 pm Posted by : ramakrishna

కేంద్ర కారాగారంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం

నిజామాబాద్, బతుకమ్మ : అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్ర కారాగారంలో శనివారం పర్యవేక్షణాధికారి చింతల దశరథం ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది, ఆశ్రమవాసులతో యోగా మాస్టర్  జలందర్ మానసిక, శారీరక ఆరోగ్యం బాగా ఉండేట్లు శిక్షణ ఇచ్చారు. శిక్ష అనుభవిస్తున్న వారి మనస్సు ద్యానం వైపు ఉండేటట్లుగా శిక్షణ ఇచ్చారు.  ఈ కార్యక్రమంలో మల్లు గౌడ్,. రజితవాణి, వెంకటేష్, మహేష్, పతంజలి యోగా కేంద్రం తరపున సాయిలు, జిల్లా ఇంచార్జి యోగా మాస్టర్స్ ప్రభాకర్, కిషన్, కేంద్ర కారాగార అధికారులు డాక్టర్.. దినేష్ గంగా, సాయి సురేష్ బాబు, రాజశేఖర్ రెడ్డి, ఉపేందర్ జైలర్లు, అనిల్ కుమార్, మన్మద రావు, డిప్యుటీ జైలర్లు, ఎం. అశోక్ కుమార్, నారాయణ, గార్డింగ్ సిబ్బంది, 550 మంది ఆశ్రమవాసులు పాల్గొన్నారు.

International Yoga Day at Central Jail